టీఆర్పీలో మళ్లీ టాప్.. ‘టాలీవుడ్‌ స్క్వేర్స్‌’

updated: February 19, 2018 14:26 IST
టీఆర్పీలో మళ్లీ  టాప్.. ‘టాలీవుడ్‌ స్క్వేర్స్‌’

ఆడియన్స్ పల్స్ పట్టి, ప్రెజంటేషన్ తో అదరకొడితే   టీవీ ప్రంపంచంలో తిరుగు ఉండదు. ఈ విషయం అందరికీ తెలుసు కానీ  కొన్ని షోలకు చెందిన టీమ్ లు  మాత్రమే నిజం చేయగలుగుతారు. అలాంటి టీమ్ ‘టాలీవుడ్‌ స్క్వేర్స్‌’ సొంతం అని ఈ వారం టీఆర్పీలతో మరోసారి  అర్దమైంది. ఈ ఆదివారం టీఆర్పీలలో   ‘టాలీవుడ్‌ స్క్వేర్స్‌’ టాప్ లో ఉండటం జరిగింది.

 

‘టాలీవుడ్‌ స్క్వేర్స్‌’ కు  ఏకంగా తొమ్మిది మంది సెలబ్రిటీలు ఒకేసారి షోలో పాల్గోవటం...అందుకు తగ్గ యాంకరింగ్ ఫెరఫెక్ట్ గా ఉండటం తో టీఆర్పీలు టాప్ లో ఉంటున్నాయి !   యాంకర్‌గా ప్రముఖ యువ నటుడు నవదీప్‌ ఈ షోను అల్లాడిస్తున్నాడనే చెప్పాలి.

 తన ఈజ్ తో ఈ పోగ్రామ్ ని జనరంజకంగా మార్చటంలో వందకు వంద మార్కులు కొట్టేస్తున్నాడు. ముఖ్యంగా టీవీ, సినీ రంగాల్లో అనుభవం ఉన్న  శరద్ మరార్ లాంటి క్రియేటివ్ జీనియస్ ఉన్న పోగ్రామ్ కు ఈ రేంటి టీఆర్పీలు మాత్రం ఆశ్చర్యమైతే కాదు. అమెరికన్‌ ఛానల్‌ ‘ఎన్బీసీ’ హిట్‌ గేమ్‌ షో ‘హాలీవుడ్‌ స్క్వేర్స్‌’ ప్రేరణతో ఈ గేమ్‌షో డిజైన్‌ చేశారు.

ఆదివారం..టాలీవుడ్ స్క్వైర్ కు  4.99 రేటింగ్ వచ్చింది. టీవీషోలలో ఈ రేటింగ్ రావటం మామూలు విషయం కాదు

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments