సీరియల్ ని రీబూట్ చేస్తోంది,ఐడియానే సూపర్బ్ కదా

updated: February 19, 2018 12:58 IST

సినిమాలని రీమేక్ చేయటం, సీక్వెల్స్ చేయటం విన్నాం..కానీ టీవీ సీరియల్ ని రీబూట్ చేయటం మాత్రం విని ఉండం. కానీ ఆ ప్రయోగం లేదా ప్రయత్నం చేస్తేంది మాత్రం టీవి సీరియల్ క్వీన్ ఏక్తాకపూర్.  ఆమె తాజాగా తన పాత సూపర్ హిట్ సీరియల్ కసౌటీ జిందగీకీ ని తిరిగి కొత్త ఆలోచనలతో, కొత్త స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కించబోతోంది. ఈ విషయమై ఆమె తన ఇనస్ట్రగ్రామ్ లో ప్రకటన చేసింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్న ఈ సీరియల్ ఏ రేంజి సక్సెస్ పొందుతుందో అని టీవి మీడియా ఎదురుచూస్తోంది. 

 

ఇక ఇప్పటికే అత్తా-కోడళ్ళ మధ్య జరిగే హాట్‌ హాట్‌ గొడవలను సరికొత్త విధంగా చూపించిన ఏక్తా కపూర్‌ను దేశంలోని మహిళా ప్రేక్షకులు విపరీతంగా మెచ్చుకుని టీఆర్పీ బహుమానాలు ఇచ్చేసారు. ఆమెను మకుటం లేని సీరియల్‌ నిర్మాతగా కీర్తించింది ప్రపంచం.  అలాగే  భారతదేశంలోని వివిధ భాషలలోనూ ఆమె రూపొందించిన  సీరియల్స్‌ ప్రేక్షకులను అలరించాయి.  వాటి పాపులారిటీ విదేశా లకు కూడా పాకింది. 

శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌లో కూడా ప్రసారం చేయగా అక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణను సంపాదించింది. ఎప్పటి కప్పుడు కొత్త కొత్తనటులను, సరికొత్త మలుపులు పరిచయం చేస్తూ తాజాదనాన్ని కాపాడటంతో అయిదు సంవత్సరాలు చూసినా తన  సీరియల్‌కు ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గటంలేని పరిస్దితి తెచ్చింది. అప్పట్లోనే ఇలాంటి క్రియేటివ్‌ ఆలోచనలతో మంచి గుర్తింపు సంపాదించింది ఏక్తా. ఆమె సీరియల్స్‌ అనేకం 'కె' అక్షరంతో ప్రారంభమవడం విశేషం.

comments