500 ఎపిసోడ్స్ పూర్తైంది, కంగ్రాట్స్

updated: February 17, 2018 13:26 IST

టెలివిజన్ ప్రపంచంలో సక్సెస్ సాధించటం అంటే మాటలుకాదు. టీఆర్పీలు తో ఏ వారానికి ఆ వారం పరీక్షే. ఆ పరీక్షలో గెలుస్తూ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే. లేకపోతే ఆ టీవీ షో కానీ, టీవి సీరియల్ కానీ మరేదైనా నిర్దాక్ష్యణంగా ఛానెల్ యాజమాన్యం తొలిగిస్తుంది.  మరో ప్రక్క ఓ రేంజిలో కాంపిటేషన్. వీటినన్నిటిని తట్టుకుని 500 ఎపిసోడ్స్ విజయవంతంగా  పూర్తి చేసుకుంది కసమ్ సీరియల్. అందుకు ఎంతో హార్డ్ వర్క్ చేసిన కసమ్ టీమ్ కు, బాలాజీ టెలీఫిలిం వారికి శుభాకాంక్షలు. నిన్న అంటే 16 పిభ్రవరిన 500 వ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. 

ఈ సక్సెస్ కు కారణం ..తాము కథ మీద పెట్టిన నమ్మకమే అంటారు దర్శక,నిర్మాతలు. గ్రిప్పింగ్ గా స్టోరీ నడిపించటంతో ఈ స్దాయి సక్సెస్ ని వారు చూడగలిగారు. ఎప్పటకప్పుడు సడెన్ సర్పైజ్ లు, ఫిమేల్ లీడ్ ని ఎగ్జిట్ చేస్తూ షాక్ లు ఇవ్వటం వంటివి చేసి ప్రజాదరణ చూరగొన్నారు. అలాగే పునర్జన్మ ఎపిసోడ్ సైతం బాగా పట్టింది.  కార్తీక, షరద్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని , అదే నిలబెట్టిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం డైవర్స్ డ్రామా ఈ సీరియల్ లో నడుస్తోంది. చూస్తూంటే అవలీలగా 1000 ఎపిసోడ్స్ దాటేటట్లుంది. 

comments