ప్రముఖ దర్శకుడు రాజమౌళి అద్బుతమైన సక్సెస్ ల వెనక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథలు ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో స్టార్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్రప్రసాద్.. రచయితగా ఎన్నో గొప్ప గొప్ప కథలను అందించాడు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా సినిమాలు చేశారు. బాహుబలి, భజరంగి భాయ్ జాన్ వంటి ఘన విజయాలు ఆయన సొంతం. రీసెంట్గాతమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'మెర్సల్' సినిమాకు కథనాన్ని కూడా ఆయనే అందించారు. ఇలా రచయితగా వెండితెరపై బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న విజయేంద్రప్రసాద్ బుల్లితెరపైనా సంచలనం సృష్టించటానికి సిద్దపడుతున్నారు.
గంగ మంగ టైటిల్ తో జీ తెలుగుకు ఓ టీవి సీరియల్ అందిస్తున్నారు. పుట్టిన వెంటనే తారుమారైన ఇద్దరు అమ్మాయిల భవిష్యత్ సైతం ఎలా తారుమారు అయ్యింది అనే ఆసక్తికరమైన డ్రామాతో ఈ సీరియల్ రూపొందుతోంది. ఈ మేరకు జీ టీవి వారు ఓ ప్రోమోను ఇప్పటికే వదిలారు. ఆ ప్రోమోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ప్రోమో చూస్తూంటే..టీవీ రంగంలోనూ విజయేంద్రప్రసాద్ సంచలనం సృష్టించబోతున్నట్లు అర్దమవుతోంది. అలాగే నిర్మాతలు కూడా ఈ టీవి సీరియల్ ని చుట్టేసినట్లు కాకుండా కాస్టలీగా ఖర్చు పెట్టి తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రోమోని మీరు ఇక్కడ చూడవచ్చు
comments