తెలుగు టెలివిజన్ చరిత్రలో 'స్టార్ మా' సరికొత్త రికార్డు!

updated: October 15, 2018 00:10 IST
తెలుగు టెలివిజన్ చరిత్రలో 'స్టార్ మా' సరికొత్త రికార్డు!

తెలుగు టెలివిజన్ చరిత్రలో 'స్టార్ మా' సరికొత్త రికార్డు!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు 14.7 టీవీఆర్

పెళ్లి చూపులకు 12.2 టీవీఆర్

ప్రైమ్ టైమ్ లో 40 శాతం వ్యూవర్ షిప్: స్టార్ మా

గడచిన దశాబ్ద కాలంలో ఏ తెలుగు టెలివిజన్ చానల్ సాధించలేకపోయిన రికార్డును సాధించామని 'స్టార్ మా' ప్రకటించింది. 1000 ప్లస్ జీఆర్పీ మార్కును తాము సాధించామని, బిగ్ బాస్ సీజన్-2 గ్రాండ్ ఫినాలే 14.7 టీవీఆర్ ను సాధించిందని 'స్టార్ మా' ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఆదివారం ప్రసారమయ్యే బ్లాక్ బస్టర్ ను 51 శాతం మంది టీవీ ప్రేక్షకులు చూస్తున్నారని, ప్రైమ్ టైమ్ కార్యక్రమాలకు 40 శాతం ఆదరణ ఉందని తెలిపింది. వారాంతంలో ప్రసారమవుతున్న 'పెళ్లిచూపులు' కార్యక్రమానికి 12.2 టీవీఆర్ వస్తోందని, సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాయంత్రం 6 నుంచి 9.30 గంటల మధ్య 40 శాతం వ్యూవర్ షిప్ తమదేనని పేర్కొంది.   


Tags: Star Maa hits the 1000+ GRP mark

comments